“హను మాన్” టీజర్ కి ఆల్ సెట్.. సాలిడ్ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ.!

Published on May 25, 2022 6:34 pm IST

మన టాలీవుడ్ లో తన సినిమాలతో “అ!” అనిపించిన యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కంప్లీట్ గా కొత్త కొత్త జానర్ సినిమాలతో ఇంటర్నేషనల్ లెవెల్ స్టఫ్ ని తన సినిమాలతో అందిస్తున్న ఈ యంగ్ దర్శకుడు ఇప్పుడు మన ఇండియా సినిమా దగ్గర ఫస్ట్ సూపర్ హీరో సినిమా “హను మాన్” ని తెరకెక్కిస్తున్నాడు. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ ఈ సూపర్ హీరో పాత్రలో నటిస్తుండగా అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుంది.

అయితే పాన్ ఇండియా లెవెల్లో అనౌన్స్ చేసిన ఈ భారీ సినిమా టీజర్ పై లేటెస్ట్ గా యంగ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ సాలిడ్ అప్డేట్ ని అందించాడు. అయితే ఈ టీజర్ కట్ ఆల్రెడీ రెడి అయ్యిపోగా ప్రస్తుతం తాము టీజర్ గ్రాఫికల్ వర్క్స్ లో బిజీగా ఉన్నామని అతి త్వరలోనే ఈ టీజర్ రిలీజ్ చేస్తామని తెలిపారు. అలాగే ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా కూడా ఒక పోస్టర్ తో మళ్లీ ఈ టీజర్ రిలీజ్ అతి త్వరలోనే రిలీజ్ అవుతుంది అని కన్ఫర్మ్ చేసాడు.

సంబంధిత సమాచారం :