‘బసవ రామ తారక పుత్రుడు’కి జన్మదిన శుభాకాంక్షలు – క్రిష్

‘బసవ రామ తారక పుత్రుడు’కి జన్మదిన శుభాకాంక్షలు – క్రిష్

Published on Jun 10, 2018 9:57 AM IST

నందమూరి నటసింహం బాలయ్య బాబు ఈ రోజు తన 58వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ‘మహానటుడు ఎన్టీఆర్’ బయోపిక్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న దర్శకుడు క్రిష్ ట్వీటర్ లో ఎన్టీఆర్ పోస్టర్ ద్వారా బాలకృష్ణకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభకాంక్షలు తెలుపుతూ..

“తన నూరవ చిత్రంలో అమ్మ పేరుని ధరించి కూస్తంత మాతృఋణం తీర్చుకున్న ‘బసవ రామ తారక పుత్రుడు’,ఇప్పుడు నాన్న పాత్రనే పోషిస్తూ కాస్తంత పితృఋణాన్ని కూడా తీర్చుకుంటున్న ‘తారక రామ పుత్రుడు’, శతాధిక చిత్ర ‘నటసింహం’, నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు.” అని బాలయ్యకు, క్రిష్ శుభకాంక్షలు తెలిపారు.

ఈ ట్వీట్‌ ఇప్పుడు బాగా వైరల్ అయింది. బాలయ్య అభిమానులు పెద్ద ఎత్తున షేర్ చేస్తూ బాలయ్య మీద తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. బాలయ్య అభిమాన సంఘ నాయకులు ఆయన పుట్టినరోజు వేడుకును ఘనంగా నిర్వహించటానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు