హ్యాపీ బర్త్ డే టూ పాన్ ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ‘ప్రభాస్’

హ్యాపీ బర్త్ డే టూ పాన్ ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ‘ప్రభాస్’

Published on Oct 23, 2022 12:00 AM IST

తొలిసారిగా ఈశ్వర్ మూవీతో టాలీవుడ్ కి హీరోగా పరిచయం అయ్యారు ప్రభాస్. ఆ తరువాత దర్శకుడు శోభన్ తెరకెక్కించిన వర్షం మూవీతో అతి పెద్ద సక్సెస్ అందుకున్న ప్రభాస్ అనంతరం రాజమౌళి తీసిన ఛత్రపతి, దశరథ్ తెరకెక్కించిన మిస్టర్ పర్ఫెక్ట్, ఆపైన కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన డార్లింగ్, అలానే మాస్ యాక్షన్ సినిమాల డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన మిర్చి మూవీస్ తో టాలీవుడ్ లో టాప్ స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ని ఎందరో ప్రేక్షకాభిమానుల ప్రేమని అందుకున్నారు.

అనంతరం దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తీసిన బాహుబలి సిరీస్ లోని రెండు సినిమాల ఆద్యద్బుత విజయాలతో హీరోగా గ్లోబల్ రీచ్ అని అందుకున్న ప్రభాస్ అక్కడి నుండి పాన్ ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఇండియా లోనే అత్యధిక పారితోషికం అందుకున్న స్టార్స్ లో ఒకరిగా భారీ క్రేజ్ తో దూసుకెళ్తున్న ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో సలార్, ఓం రౌత్ తో ఆదిపురుష్, అలానే నాగ అశ్విన్ తో ప్రాజక్ట్ కె మూవీస్ చేస్తున్నారు. ఇక నేడు ఆయన బర్త్ డే కావడంతో పలువురు ఆయన ఫ్యాన్స్ తో పాటు అనేకమంది ప్రేక్షకులు, సినిమా ప్రముఖులు ఎంతో ప్రేమతో హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. కాగా మా 123తెలుగు.కామ్ సంస్థ తరపున మన బాహుబలి ప్రభాస్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు