టాలెంటెడ్ నటుడైన నితిన్ కి మెగా కుటుంబం అంటే ఎంత ప్రీతో చెప్పక్కర్లేదు. ఎప్పటికీ చిరంజీవి గారే నా ఫేవరేట్ హీరో అని చెప్పే నితిన్ మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్ కోసం ఏమైనా చేసేసే అభిమాని. అందుకే చాలా సినిమాలో మెగా కుటుంబాన్ని వాడుకున్నా అభిమానులు ఫీల్ అవ్వడంలేదు
ప్రస్తుతం నితిన్ ప్రేమకధా చిత్రాలకి నిలయమైన కరుణాకరణ్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఆ సెట్ కి అనుకోకుండా అల్లు అర్జున్ రావడంతో నితిన్ ఆనందానికి అవధులు లేవు. మా సెట్ కి ఒక సర్ప్రైజ్ అని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కరుణాకరణ్ గతంలో అల్లు అర్జున్ ‘హ్యాపీ’ సినిమా చేసిన సంగతి తెలిసిందే


