జూలైలో విడుదలకానున్న మెగా డాటర్ చిత్రం !
Published on Jun 28, 2018 1:43 pm IST

మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా చేస్తున్న రెండవ చిత్రం ‘హ్యాపీ వెడ్డింగ్’. అన్ని పనులు పూర్తిచేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. చిత్రాన్ని జూలై నెలలో విడుదలచేయాలని నిర్మాతలు నిర్ణయించారు. అంతేగాక ఈ నెల 30వ తేదీన చిత్ర ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు కూడ మంచి స్పందన లభించింది.

రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటెర్టైనర్ గా ఉండనున్న ఈ సినిమాలో పెళ్లి యొక్క ప్రాముఖ్యతను ప్రధానంగా వివరించనున్నారు ఈ చిత్రానికి శక్తికాంత్ కార్తీక్ సంగీతాన్ని అందివ్వనుండగా ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించనున్నారు. ఈ సినిమాలో నరేష్, మురళీ శర్మ, పవిత్రా లోకేష్ వంటి వారు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్ర విజయంపై హీరో సుమంత్ అశ్విన్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook