దీపావళి అంటేనే దీపోత్సవం. టపాసుల శబ్దాలతో, చిచ్చుబుడ్డులు చప్పుళ్లతో, లక్ష్మీ టపాసుల వెలుగులతో.. ఇల్లంతా సరదా సందట్లో హడావుడిగా ఉంటుంది. అందుకే సినిమా తారలు కూడా దీపావళి తమ ఫేవరేట్ ఫెస్టివల్ గా చెబుతుంటారు. తమ సినిమాలకి సంబంధించిన అప్ డేట్స్ ను పోటీ పడి మరి దీపావళి రోజే విడుదల చేస్తుంటారు. కాగా తాజాగా మన స్టార్ హీరోలు తమ అభిమానులకు మరియు ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ… ‘మీకు, మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి కాంతులు మనందరి జీవితాల్లో సుఖ సంతోషాలను తీసుకు రావాలని కోరుకుంటున్నాను. జాగ్రత్తగా ఎంజాయ్ చేద్దాం’ అని ఎన్టీఆర్ పోస్ట్ చేశారు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘ప్రతి ఒక్కరికీ దీపావళి శుభాకాంక్షలు. మీ జీవితం సంతోషం, నమ్మకం, వెలుగులతో నిండాలని కోరుకుంటున్నాను’ అని పోస్ట్ చేశారు.
మీకు మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు. May this festival of lights bring happiness and prosperity to all of us. Enjoy safely! #HappyDiwali2019
— Jr NTR (@tarak9999) October 27, 2019
#HappyDiwali to each one of you ???? May your life be filled with light, hope, and happiness. Have a joyful Diwali! ✨✨✨ pic.twitter.com/sQlnZxGhy6
— Mahesh Babu (@urstrulyMahesh) October 27, 2019


