గ్రాండ్ ప్రెస్ మీట్‌తో ప్రమోషన్స్ షురూ చేస్తున్న వీరమల్లు

గ్రాండ్ ప్రెస్ మీట్‌తో ప్రమోషన్స్ షురూ చేస్తున్న వీరమల్లు

Published on May 17, 2025 4:10 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం హరిహర వీరమల్లు కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేయగా పూర్తి హిస్టారికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని మేకర్స్ రూపొందించారు. ఇక ఈ సినిమాలో పవన్ పాత్ర ప్రేక్షకులను స్టన్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతూ వస్తోంది. ఇటీవల ఈ చిత్ర షూటింగ్‌ను పవన్ ముగించిన సంగతి తెలిసిందే.

దీంతో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఈ చిత్రం ఫుల్ బిజీగా ఉంది. అంతేగాక, ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ను కూడా వారు మొదలుపెట్టేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగా మే 21న ఉదయం 11 గంటలకు ఓ గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో ఈ ప్రెస్ మీట్‌లో హరిహర వీరమల్లు చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ పంచుకుంటారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి, సత్యరాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తుండగా ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ 12న పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు