స్పెషల్ రోజున రానున్న ‘హరిహర వీరమల్లు’

స్పెషల్ రోజున రానున్న ‘హరిహర వీరమల్లు’

Published on May 16, 2025 4:43 PM IST

Hari Hara Veera Mallu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తుండగా హిస్టారికల్ చిత్రంగా ఈ మూవీ రానుంది. ఇక అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ తాజాగా ప్రకటించారు.

జూన్ 12న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే, పవన్ అభిమానులకు జూన్ 12 ఎంతో ప్రత్యేకమైన రోజు. గతేడాది ఇదే తేదీన పవన్ ఏపీ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాడు. ఇప్పుడు అదే రోజున ఆయన సినిమా వస్తుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా ఎంతో ప్రత్యేకమైన రోజున హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్ అవుతుండటంతో ఈ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు