ఈ ఏడాదిలో మన టాలీవుడ్ బిగ్ స్టార్స్ నుంచి పెద్దగా సినిమాలు రాలేదు. ఇలా ఏడాది సగం పూర్తయ్యాక వస్తున్న అవైటెడ్ భారీ చిత్రమే “హరిహర వీరమల్లు”. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కించగా ఈసారి రిలీజ్ పక్కా కావడంతో హైప్ అంతకంతకు ఎక్కువ అవుతుంది. మరి ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లు టీం ఆడియెన్స్ కి సహా ఫాన్స్ కి కూడా కావాల్సిన సాలిడ్ ట్రీట్ ని గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.
ఇలా వీరమల్లు క్లైమాక్స్ పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారట. క్లైమాక్స్ ఎపిసోడ్ మొత్తం 6 వారాలు పాటు షూటింగ్ చేయగా ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ కూడా కీలక పాత్ర పోషిస్తాయి అని తెలుస్తుంది. ఇలా ఒక క్రేజీ ఎపిసోడ్ తో వీరమల్లు క్లైమాక్స్ ఆడియెన్స్ కి థియేటర్స్ లో మంచి ట్రీట్ అందిస్తుంది అని టాక్. మరి ఇది ఎంతవరకు నిజం అనేది ఈ జూన్ 12 వరకు ఆగితే తేలిపోతుంది.