అభిజీత్ తో రిలేషన్ పై ఫైనల్ గా ఓపెన్ అయిన హారిక.!

Published on Jan 22, 2021 11:06 am IST

ప్రపంచపు బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ మన తెలుగు లో కూడా అంతే స్థాయి ఆదరణను రాబట్టుకున్న సంగతి తెలిసిందే. అలా ఇప్పటికి నాలుగు సెన్సేషనల్ సీజన్లను పూర్తి చేసుకుంది. అయితే గత మూడు సీజన్స్ లో లేని విధంగా ఈసారి నాలుగో సీజన్ కు కాస్త భిన్నంగానే జరిగింది.

పెద్దగా తెలియని కంటెస్టెంట్స్ ఉన్నారని చప్పగా స్టార్ట్ అయినా చివరకు వచ్చే సరికి చాలా మందికే ఇంతకు ముందు సీజన్లలో ఏ కంటెస్టెంట్స్ కు రాని గుర్తింపు మరియు అవకాశాలను అందించింది. అయితే ఈసారి సీజన్లో కూడా రొమాంటిక్ యాంగిల్ బాగానే పండింది. మరి ఆ కపుల్స్ లో గుర్తొచ్చేది అఖిల్ మోనాల్ లతో పాటుగా టైటిల్ విన్నర్ అభిజీత్ మరియు దేతడి హారిక కూడా ఒకరు.

అయితే హౌస్ నుంచి బయటకు రాక ముందు వరకు అభిజీత్ మరియు హారికల మధ్య రిలేషన్ వేరే ఏమో అని అంతా అనుకున్నారు. కానీ అభిజీత్ హారిక తనకు చిట్టి చెల్లి లాంటిది అని చెప్పడంతో అందరికీ షాక్ ఇచ్చింది. మరి ఇదే అనుకుంటే లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో వారి రిలేషన్ పై ఓపెన్ అయ్యింది.

తమ ఇద్దరికీ ఒక ఆర్గానికి ఫ్రెండ్షిప్ ఉందని నిజానికి హౌస్ లో కూడా మేము ఇద్దరం బ్రదర్ సిస్టర్ రిలేషన్ తోనే పిలుచుకునే వాళ్ళం కానీ అవి టెలికాస్ట్ చెయ్యలేదు. సో అలా మా రిలేషన్ బయట వేరేలా లింక్ అయ్యింది అని ఫైనల్ క్లారిటీ ఇచ్చింది. అయితే ఇప్పుడు తనకు కూడా చాలానే ఆఫర్స్ తో బిజీగా ఉన్నానని చెప్తుంది.

సంబంధిత సమాచారం :

More