టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ తో మిస్టర్ బచ్చన్ అనే చిత్రాన్ని చేస్తున్నారు. ఈ చిత్రం త్వరలో రెగ్యులర్ షూట్ ను జరుపుకోనుంది. అయితే ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేయగా, టైటిల్ సూపర్ అంటూ పలువురు సినీ ప్రముఖులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. ఈ మేరకు మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ హరీష్ శంకర్ లేటెస్ట్ మూవీ అయిన మిస్టర్ బచ్చన్ పై రెస్పాండ్ అయ్యారు.
ఆల్ ది బెస్ట్ అని తెలిపిన దేవి శ్రీ ప్రసాద్, టైటిల్ అదుర్స్ అంటూ చెప్పుకొచ్చారు. చిత్ర యూనిట్ కి సైతం ఆల్ ది బెస్ట్ తెలిపారు. అందుకు డైరెక్టర్ హరీష్ శంకర్ స్పందిస్తూ, నేను ఎప్పుడూ చెప్పినట్లు గా నువ్వు కేవలం నాకు మ్యూజిక్ డైరెక్టర్ వి మాత్రమే కాదు, నా ఎనర్జీ కూడా అంటూ చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
As I always say… ur not just a music director for me….
You are my ENERGY…Love you Sir ji…… ???????????????? https://t.co/Q8O4gMevhw
— Harish Shankar .S (@harish2you) December 18, 2023


