వాళ్ళని బ్లాక్ చేసుకుంటూ వెళ్లిపోతున్న హరీష్.!

Published on Jun 12, 2021 11:00 am IST

ప్రస్తుతం మన టాలీవుడ్ టాప్ దర్శకుల్లో స్టార్ దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఒకరు. అయితే హరీష్ శంకర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ఏదన్నా ఉంది అంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసిన చిత్రం “గబ్బర్ సింగ్” అని తెలిసిందే. అందుకే దాని తర్వాత మళ్ళీ ఈ కాంబో రిపీట్ అవుతుంది అనేసరికి మరో స్థాయి అంచనాలు నెలకొన్నాయి.

మరి ఇదిలా ఉండగా గత కొన్ని రోజులు నుంచి ఈ సినిమాపై స్ప్రెడ్ అవుతున్న రూమర్స్ తో హరీష్ విస్తు పోయి చాలా మంది పవన్ అభిమానులనే సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో బ్లాక్ చేస్తూ వెళ్ళిపోతున్నారట. వారిలో కొంత మంది ఇలా డౌట్ ఉందని అడుగుతున్న వారు తమని కూడా బ్లాక్ చేస్తున్నారని వాపోతున్నారు.

మరి ఆ లెవెల్లో హరీష్ విసిగిపోయారేమో చెప్పాలి. ఇప్పటికే అప్డేట్స్ అప్ టు డేట్ ఇస్తామని హరీష్ హామీ ఇచ్చారు. మరి అప్పటి వరకు వారు కూడా సమన్వయం పాటిస్తే మంచిది. ఇక ఈ సాలిడ్ ప్రాజెక్ట్ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రం షూట్ కూడా త్వరలోనే స్టార్ట్ కానుంది.

సంబంధిత సమాచారం :