హరీష్ శంకర్ సైతం భరించలేకపోతున్నారు !

Published on Jun 11, 2021 1:04 am IST

పవన్ కళ్యాణ్ చేస్తున్న క్రేజీ సినిమాల్లో హరీష్ శంకర్ సినిమా ఒకటి. ఈ ప్రాజెక్ట్ మీద మాస్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అసలు పవన్ కమ్ బ్యాక్ సినిమా హరీష్ డైరెక్షన్లోనే ఉండి ఉంటే ఇంకా గొప్పగా ఉండేదన్న అభిమానులు కూడ ఉన్నారు. అంత క్రేజ్ ఉంది వీరి కాంబినేషన్ మీద. కరోనా లాక్ డౌన్ లేకుండా ఉంటే ఈపాటికే వీరి సినిమా సెట్స్ మీద ఉండేది. కానీ ఆలస్యమైంది. అభిమానులైతే ఇంకెన్నిరోజులు ఎదురుచూడాలి అంటున్నాడు. కనీసం పవన్ లుక్, టైటిల్ రివీల్ చేయవచ్చు కదా అంటున్నారు. కేవలం అభిమానులే కాదు హరీష్ శంకర్ సైతం ఎదురుచూపులు భరించలేకుండా ఉన్నారు.

ఎప్పుడేప్పుడు తన అభిమాన హీరోతో సినిమా మొదలుపెడదామా, షూటింగ్ స్టార్ట్ చేద్దామా అనే ఆతురుతలో ఉన్నారు. సినీ వర్గాల సమాచారం మేరకు ఆగష్టు నెలలో సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయిందట. టైటిల్, ఫస్ట్ లుక్ కూడ లాక్ అయ్యాయి. రిలీజ్ చేయడానికి తగిన సమయం కోసం చూస్తున్నారు. గతంలో పవన్ హీరోగా హరీష్ శంకర్ చేసిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్టైనర్. ఈసారి చేయనున్న సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ సహా మంచి సోషల్ మెసేజ్ కూడ ఉండనుంది. ఈ క్రేజీ ప్రాజెక్టును
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.

సంబంధిత సమాచారం :