పవన్ సాలిడ్ ప్రాజెక్ట్ కి ఊరమాస్ టైటిల్..క్లారిటీ ఇచ్చిన హరీష్.!

Published on Jun 11, 2021 4:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో తన హిట్ దర్శకుడు హరీష్ శంకర్ తో ప్లాన్ చేసిన సాలిడ్ ప్రాజెక్ట్ కూడా ఒకటి. మరి ఈ చిత్రంపై ఎలాంటి అంచనాలు కూడా ఉన్నాయో అందరికీ తెలిసిందే.. ఈ మధ్యనే వచ్చిన ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ కే ఏకంగా దర్శకుడు సహా నిర్మాతలు వచ్చి అధికారిక అప్డేట్ ను ఇచ్చారు.

అంత పని చేసింది ఆ పోస్టర్.. ఇప్పుడు మరి అదే బాటలో ఓ ఊరమాస్ టైటిల్ ఈ చిత్రానికి ఫిక్స్ అయ్యినట్టుగా మరో టాక్ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ టైటిల్ ఏమిటంటే “స్టేట్ కి ఒక్కడు” అట.. ఇది ఎంత వరకు నిజమో కానీ ఈ సినిమాపై ఉన్న హైప్ కి మ్యాచ్

చేస్తూనే ఇది అనిపిస్తుంది. పైగా పవన్ ఇమేజ్ కి ఈ చిత్రం బ్యాక్ డ్రాప్ కి కూడా సెట్టయ్యినట్టే అనిపిస్తుంది.
అయితే మరి ఈ పవర్ ఫుల్ ఫుల్ టైటిల్ పై దర్శకుడు హరీష్ ఇపుడు స్పందించారు. తన దృష్టికి ఇది కూడా వచ్చింది అని అలా గాసిప్స్ ప్రచారం చేస్తున్న వారిని బ్లాక్ చేసేస్తున్నాని అంతకు మించి మరో దారి కనబడలేదు అని క్లారిటీ ఇచ్చారు. సో ఆ టాక్ లో నిజం లేదనే అనుకోవాలి.

సంబంధిత సమాచారం :