“బద్రి” కళ్యాణ్ ను విట్నెస్ చేస్తామంటున్న హరీష్.!

Published on Jun 27, 2021 8:38 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ ఉంటుంది.. అలాగే అదే అప్పటి నుంచీ యూత్ ని అట్రాక్ట్ చేసి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను తెచ్చి పెట్టింది. అయితే ఆ యాటిట్యూడ్ ని ఫుల్ ఫ్లెడ్జ్ గా “బద్రి” సినిమాతో దర్శకుడు పూరి జగన్నాథ్ చూపించారు. అందులో పవన్ ఎనర్జీ కానీ స్వాగ్ కానీ ఇప్పటికీ మంచి హై అభిమానులకు ఇస్తాయి.

మరి అలాంటి బద్రి లోని పవన్ కళ్యాణ్ ని మళ్ళీ మీరు విట్నెస్ చేస్తారని పవన్ బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీష్ శంకర్ మాటిచ్చారు. లేటెస్ట్ గా పెట్టిన ట్వీట్ లో పవన్ బద్రి కట్స్ వీడియోతో కన్ఫర్మ్ చేశారు. దీనితో ఈ కాంబో నుంచి రాబోతున్న సినిమా పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.. ఇక ఈ సాలిడ్ ప్రాజెక్ట్ కు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే..

సంబంధిత సమాచారం :