టాలీవుడ్ లో ప్రస్తుతం మంచి క్రేజ్ తో పలు సక్సెస్ఫుల్ సినిమాలతో దర్శకుడిగా ఆడియన్స్ యొక్క మెప్పుతో దూసుకెళ్తున్నారు హరీష్ శంకర్. తొలిసారిగా షాక్ సినిమా ద్వారా టాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన హరీష్, ఆ తరువాత రవితేజ తో మిరపకాయ్, పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ వంటి పెద్ద సక్సెస్ఫుల్ సినిమాలు తెరకెక్కించి ఆడియన్స్ లో తనకంటూ ప్రత్యేక మాస్ కమర్షియల్ క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం మరొక్కసారి తన అభిమాన పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చేస్తున్నారు హరీష్.
అయితే ఇటీవల కొన్నాళ్లుగా కొందరు నెటిజన్స్ ని ఆయన తన ట్విట్టర్ లో బ్లాక్ చేస్తుండడంతో ఒక అభిమాని ఈ విషయమై నేడు హరీష్ శంకర్ కి ట్వీట్ చేసారు. అయితే తాను వారిని బ్లాక్ చేసింది తప్పుగా మాట్లాడి పరుష పదజాలం ఉపయోగించినందుకు మాత్రమే అని, అలానే తనకు ఎప్పుడూ విమర్శలు స్వీకరించడానికి సిద్ధమని అతడికి రిప్లై ఇచ్చారు హరీష్. కాగా ఇటీవల రిలీజ్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఫస్ట్ గ్లింప్స్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభించిన విషయం తెల్సిందే. శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.
Manalo manaku guilty enti Thammudu…. We all are one let’s enjoy CINEMA ????????????????
Boothulu use chesina vallani maatrame block chesaa
am always open to criticism… https://t.co/EFOWLMGiZw— Harish Shankar .S (@harish2you) May 13, 2023


