ఫ్యాన్స్ సారీ చెప్పారు, పవన్ హగ్ ఇచ్చారు – హరీష్ శంకర్

ఫ్యాన్స్ సారీ చెప్పారు, పవన్ హగ్ ఇచ్చారు – హరీష్ శంకర్

Published on Mar 24, 2026 1:00 AM IST

Harish-shankar

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – డైరెక్టర్ హరీష్ శంకర్ కలయికలో వచ్చిన సినిమా “ఉస్తాద్ భగత్ సింగ్”. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా, బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. పైగా అటు పవన్ ఫ్యాన్స్ సైతం కొందరు నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఐతే, దర్శకుడు హరీష్ శంకర్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. ఈ సినిమా విడుదలైన మరుసటి రోజు పవన్ కళ్యాణ్ ని కలిసినప్పుడు జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను వెల్లడించారు.

హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ‘గబ్బర్ సింగ్’ అప్పుడు కళ్యాణ్ గారు మూడు రోజుల తర్వాత మమ్మల్ని కలిశారు. ఈసారి మాత్రం రెండో రోజే కలిశారు. ఆయన తన ఫోన్ చూస్తుంటే ఆయనకు కొన్ని నోటిఫికేషన్స్ కనిపించాయట. అవి నా గురించి ఫ్యాన్స్ పెట్టిన మెసేజ్ లు అట. ‘ఏంటయ్యా.. మన ఫ్యాన్స్ అందరూ సారీ అన్నా, నిన్ను ఏదో అన్నాము.. మాకు ఫుల్ మీల్స్ పెట్టావు’ అని నిన్ను ఉద్దేశించి పోస్ట్ లు పెట్టారు. అసలు ఏమైంది ? అని నన్ను అడిగారు. సినిమా రిలీజ్ కి ముందు నన్ను ట్రోల్ చేశారు. ఇప్పుడు సినిమా చూసి.. హ్యాపీగా ఫీల్ అవుతున్నారు’ అని నేను కళ్యాణ్ గారితో చెప్పాను. దానికి పవన్ కళ్యాణ్ గారు కంగ్రాట్స్ చెప్పి, నాకు షేక్ హ్యాండ్ తో పాటు హగ్ కూడా ఇచ్చారు’ అని హరీష్ శంకర్ చెప్పుకొచ్చారు.

తాజా వార్తలు