వాల్మీకి కోసం హరీష్ శంకర్ కొత్త ట్రెండ్ !

Published on Jun 6, 2019 2:00 am IST

సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి, హైప్ క్రియేట్ చేయడానికి కావాల్సింది ప్రమోషన్లు. అది కూడా సాదాసీదా ప్రమోషన్లు చేస్తే కుదరడంలేదు. అందుకే దర్శకులు, పిఆర్ టీమ్స్ కొత్త కొత్త పద్ధతుల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఆ ప్రచార పద్ధతుల్లో ఇప్పటికే ఫస్ట్ లుక్, ప్రీ లుక్, టీజర్, ట్రైలర్, మోషన్ పోస్టర్, డైలాగ్ ప్రోమోస్, కౌటింగ్ పోస్టర్స్, టైటిల్ పోస్టర్, క్యారెక్టర్ పోస్టర్స్ అంటూ రకరకాల పద్ధతుల్ని ఇప్పటికే మనం చూశాం.

కానీ హరీష్ శంకర్ అండ్ టీమ్ మాత్రం ఇప్పుడు వాటన్నిటికీ భిన్నంగా కొత్త ట్రెండ్ స్టార్ట్ చేస్తున్నారు. అదే ప్రీ టీజర్. ఇప్పటి వరకు ట్రైలర్లకు ముందు వచ్చే టీజర్లు సినిమా నేపథ్యాన్ని, కీలక పాత్రల్ని పరిచయం చేస్తుండేవి.. మరి త్వరలో రానున్న ఈ ప్రీ టీజర్‌లో హరీష్ శంకర్ సినిమాను ఏ రీతిలో పరిచయం చేస్తారో చూడాలి. తమిళ చిత్రం ‘జిగర్తాండ’కు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్, ఆత్రవ మురళి, పూజా హెగ్డేలు కీలక పాత్రలు చేస్తున్నారు. 14 రీల్స్ సంస్థపై రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More