సాయి ధరమ్ తేజ్ సూపర్ ఫిట్‌గా ఉన్నాడు – హరీశ్ శంకర్

Published on Oct 21, 2021 2:54 am IST


మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే సాయి ధరమ్‌ తేజ్ కోలుకుంటున్నాడని, ఆయన ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని వైద్యులు, కుటుంబ సభ్యులు చెబుతూనే ఉన్నారు కానీ ఇప్పటివరకు సాయి తేజ్‌ని మాత్రం మీడియాకి కానీ ఎలాంటి లైవ్ ద్వారా కానీ చూపించలేదు.

అయితే సాయి తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమా మంచి సక్సెస్‌ని అందుకుంది. నా పై మరియు నా చిత్రంపై మీ ప్రేమ మరియు ఆప్యాయతకి కృతజ్ఞతలు తెలపడానికి ధన్యవాదాలు అంటూ తంబ్ చూపిస్తూ త్వరలోనే మీ ముందుకొస్తానని సాయి తేజ్ చెప్పుకొచ్చాడు. అయితే తాజాగా దర్శకుడు హరీశ్ శంకర్ ఆసుపత్రిలో తేజ్‌ని పరామర్శించినట్టు తెలుస్తుంది. నా సోదరుడు సాయి తేజ్‌ని కలిసాను, అతను సూపర్ ఫిట్‌గా ఉన్నానని, త్వరలోనే కోలుకుంటున్నానని చెప్పడం చాలా సంతోషంగా అనిపించిందని చెబుతూ తేజ్‌తో చేతులు కలిపిన ఫోటోను హరీశ్ షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌గా మారింది.

సంబంధిత సమాచారం :