క్రేజీ కాంబినేషన్.. మరోసారి రవితేజ – హరీష్ శంకర్

Published on Apr 20, 2021 11:00 pm IST

మాస్ మహారాజ్ రవితేజ ఏ కమర్షియల్ దర్శకుడి చేతిలో అయినా ఇట్టే ఒదిగిపోగలడు. అందుకే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఇండస్ట్రీలో ఉన్న దాదాపు అందరు దర్శకులు రవితేజతో సినిమాలు చేసినవాళ్ళే. ఒక్కసారి కాదు ఆయనతో మళ్ళీ మళ్ళీ సినిమాలు చేయాలని అనుకుంటుంటారు. ప్రజెంట్ హరీష్ శంకర్ కూడ అదే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే రవితేజతో హరీష్ శంకర్ రెండు సినిమాలు చేశారు. వాటిలో ఒకటి ‘షాక్’. ఆ సినిమాతోనే హరీష్ శంకర్ డైరెక్టర్ అయ్యారు. ఆ తర్వాత ‘మిరపకాయ్’ చేశారు. అది ఆయన్ను కమర్షియల్ దర్శకుడిగా నిలబెట్టింది.

ఇప్పుడు మూడవసారి రవితేజతో వర్క్ చేయడానికి రెడీ అవుతున్నారట ఆయన. హరీష్ శంకర్ త్వరలో పవన్ కళ్యాణ్ సినిమా చేయాల్సి ఉంది. పవన్ ప్రజెంట్ చేస్తున్న రెండు సినిమాలు కంప్లీట్ అవ్వగానే హరీష్ శంకర్ చిత్రం పట్టాలెక్కుతుంది. అది పూర్తికావడానికి ఈ ఏడాది ఆఖరు అవుతుంది. అది ముగియగానే రవితేజతో వర్క్ చేయాలని ప్లాన్ చేసుకున్నారట ఆయన. ఇప్పటికే ఇద్దరి మధ్య కథా చర్చలు కూడ జరుగుతున్నాయని టాక్ నడుస్తోంది. అన్నీ కుదిరితే 2022 ఆరంభంలో వీరి సినిమా ఉండవచ్చు అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

సంబంధిత సమాచారం :