హరీష్ మరోసారి రీమేక్ నే నమ్ముకుంటున్నాడు !

Published on Oct 28, 2018 9:39 pm IST

‘దబాంగ్’ చిత్రాన్ని తెలుగులో ‘గబ్బర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని అందుకున్నాడు ట్యాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్. ఈచిత్రం ఆయనకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఇక ఇప్పుడు ఆయన మరోసారి రీమేక్ సినిమాపై ద్రుష్టి పెట్టాడట. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘జిగర్తాండ’ ను తెలుగులో రీమేక్ చేయాలని అనుకుంటున్నాడట హరీష్. కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం పలు జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకుంది.

థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం రీమేక్ చేస్తే బాగుటుందని హరీష్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసే పనిలో పడ్డాడట. ఇక ఆయన ఇంతకుముందు దిల్ రాజు బ్యానర్ లో ‘దాగుడుమూతలు’ అనే మల్టీ స్టారర్ చిత్రాన్ని తెరకెక్కించాలని ప్లాన్ చేసుకున్నాడు కానీ ఎందుకనో అది వర్క్ అవుట్ కాలేదు.

సంబంధిత సమాచారం :