బాలయ్య ‘డిక్టేటర్’లో బ్రహ్మి మిస్సింగ్!!

బాలయ్య ‘డిక్టేటర్’లో బ్రహ్మి మిస్సింగ్!!

Published on Nov 4, 2015 8:47 PM IST

Brahmanandam
నటసింహం నందమూరి బాలకృష్ణ నుంచి వస్తున్నా 99వ సినిమా ‘డిక్టేటర్’. లౌక్యం ఫేం శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి కోన వెంకట్ – గోపి మోహన్ కలిసి కథని అందించారు. బాలయ్య 99వ సినిమాకి ఓ డిఫరెంట్ కథని అడగడంతో కోన వెంకట్ – గోపి మోహన్ కలిసి బాలయ్య అభిమానులు కోరుకునే యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటూనే ఫుల్ లెంగ్త్ కామెడీ కూడా ఉండేలా కథని సిద్దం చేసారు. ఎప్పటిలానే కోన – గోపిలు తమ కథలలో బ్రహ్మనందం కోసం స్పెషల్ రోల్స్ క్రియేట్ చేస్తుంటారు. అలానే ఈ డిక్టేటర్ సినిమా కోసం కూడా ఓ రోల్ క్రియేట్ చేసారు.

ఈ సినిమాకి ఇదో ప్రధాన పాత్ర కావడం వలన బ్రహ్మానందంవి ఎక్కువగానే డేట్స్ కావాల్సి వచ్చింది. కానీ అప్పటికే బ్రహ్మానందం దగ్గర డేట్స్ లేకపోవడం వలన, అలాగే సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేయడం వలన డిక్టేటర్ టీం వద్ద కూడా ఎక్కువ టైం లేకపోవడం వలన బ్రహ్మి ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని సమాచారం. ప్రస్తుతం మరో బ్రహ్మి రోల్ కోసం మరో కమెడియన్ ని చూస్తున్నారు. ఇప్పటికే 70% షూట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మొత్తం షూట్ ని డిసెంబర్ మొదటి వారం కల్లా ఫినిష్ చేయనున్నారు. బాలకృష్ణ సరసన అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ డైరెక్టర్.

తాజా వార్తలు