ఆ స్టార్ డైరెక్టర్ సినిమా ఎప్పుడో అర్ధం కానీ పరిస్థితి ?

Published on Apr 10, 2019 1:59 pm IST

వినాయక్ తో సినిమా చెయ్యడం కోసం ఒకప్పుడు స్టార్ హీరోలు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవారు. దానికి తగ్గట్లుగానే స్టార్ డైరెక్టర్ గా వినాయక్ వరుస హిట్స్ అందుకున్నాడు. కానీ ప్రస్తుతం పరిస్థితులు వినాయక్ కి ఏ మాత్రం అనుకూలించట్లేదు. నందమూరి బాలకృష్ణతో ఎప్పుడో మొదలు ఆవ్వాల్సిన సినిమా ఇంకా ప్రారంభం కూడా కాలేదు. దాంతో వినాయక్ ఇక చేసేదేం లేక వెంకటేష్ కి ఓ లైన్ చెప్పాడు.

కానీ వెంకీ కూడా ఇప్పటికే ‘వెంకీమామ’ షూట్ లో బిజీగా ఉన్నాడు, పైగా వెంకీ మామ తరువాత నక్కిన త్రినాధరావుతో సినిమా చెయ్యడానికి అంగీకరించాడు. మరి ఈ లెక్కన వినాయక్ సినిమా ఎప్పుడో అర్ధం కానీ పరిస్థితి. ప్రస్తుతం వినాయక్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడట.

కానీ ప్రస్తుతం ఫామ్ లో ఉన్న హీరోలు, ఫామ్ లో ఉన్న డైరెక్టర్స్ తో సినిమా చెయ్యడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారనే టాక్ ఉన్న నేపథ్యంలో.. ఇప్పుడు ఏ స్టార్ హీరో వినాయక్ కి సినిమా ఇస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :