సిద్ధుతో చేతులు కలుపుతున్న హసిత్.. డబుల్ ఫన్ ఖాయం..?

Siddhu 1

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలీ తన తదుపరి భారీ ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నారు. ‘రాజ రాజ చోర’తో కమర్షియల్ హిట్ కొట్టి, ‘స్వాగ్’తో వైవిధ్యమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న హసిత్, ఈసారి ‘స్టార్ బాయ్’ సిద్ధు జొన్నలగడ్డతో జతకట్టబోతున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉంది. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఈ సినిమా కథాంశం కూడా హసిత్ గోలీ మార్క్ వినోదంతో నిండి ఉంటుందని సమాచారం. అయితే ఈసారి కామెడీతో పాటు బ్యాక్‌గ్రౌండ్ సెటప్ చాలా కొత్తగా ఉండేలా దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ ఎనర్జీకి హసిత్ రాసుకున్న విభిన్నమైన పాత్ర తోడైతే బాక్సాఫీస్ వద్ద నవ్వుల జాతర ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. పూర్తి స్థాయి వినోదభరిత చిత్రంగా ఈ ప్రాజెక్టును రూపొందించేందుకు చిత్ర బృందం కసరత్తు చేస్తోంది.

మరోవైపు సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ స్వరూప్‌తో చేస్తున్న సినిమాతో పాటు, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ‘బ్యాడ్ యాజ్’, ‘కోహినూర్’ వంటి చిత్రాలు లైన్లో ఉన్నాయి. వీటికి తోడు ‘టిల్లు క్యూబ్’ కూడా ఈ ఏడాదిలోనే పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. ఇన్ని ప్రాజెక్టుల మధ్య హసిత్ గోలీ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందో చూడాలి.

Exit mobile version