తన టీం విషయంలో మురుగదాస్ కి హ్యాట్సాఫ్.!

Published on Mar 16, 2023 9:15 pm IST

కోలీవుడ్ సహా దక్షిణాది సినిమా దగ్గర తనదైన సినిమాలతో ఓ ముద్ర వేసిన దర్శకుల్లో వెర్సటైల్ ఫిల్మ్ మేకర్ ఏ ఆర్ మురుగదాస్ కూడా ఒకరు. అయితే ఏ ఆర్ మురుగదాస్ ఇప్పటివరకు ఎన్నో వినూత్న సందేశాత్మక సినిమాలు ప్రయోగాలు చేశారు. మరి ఇప్పుడు అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ తో “దర్బార్” తర్వాత ఇప్పటివరకు తాను నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంకా అనౌన్స్ చేయకుండా సినిమా స్క్రిప్ట్స్ రెడీ చేసుకునే పనిలోనే ఉన్నారు.

అయితే ఇలా ఓ దర్శకుడికి రెండేళ్లు గ్యాప్ వచ్చింది అంటే తన సినిమా యూనిట్ అందరికీ కూడా పని లేనట్టే..అలాగే మురుగదాస్ కోర్ టీం కి కూడా ఈ రెండేళ్లలో పని లేకుండా పోయింది. కానీ ఈ రెండేళ్ల పాటుగా కూడా మురుగదాస్ వారికి అన్యాయం చేయలేదట. వారి క్రమం తప్పకుండా జీతాలు ఇస్తూ వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా తాను చూసుకున్నారని లేటెస్ట్ గా తెలుస్తున్న సమాచారం. దీనితో మురుగదాస్ పనికి మాత్రం హ్యాట్సాఫ్ చెప్పి తీరాలి.

సంబంధిత సమాచారం :