త్రివిక్రమ్, మహేష్ సినిమాకి అతడు ఆల్ మోస్ట్ కన్ఫర్మ్.!

Published on Jun 1, 2021 1:00 pm IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి పలు క్రేజీ అండ్ సెన్సేషనల్ కాంబోస్ లో సూపర్ స్టార్ మహేష్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబో కూడా ఒకటి. అయితే వీరిద్దరి నుంచి అంత భారీ హిట్స్ లేకపోయినా కల్ట్ క్లాసిక్ లు అయితే ఉన్నాయి. అందుకే ఆ సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ఇపుడు వస్తున్న హ్యాట్రిక్ చిత్రంపై ఎనలేని అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ చిత్రం అనౌన్స్ చేసినపుడు పలు డీటెయిల్స్ ఇంకా గోప్యంగానే ఉంచారు. ఈ చిత్రానికి హీరోయిన్స్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో కానీ ఇంకా అధికారిక క్లారిటీ లేదు కానీ స్ట్రాంగ్ ఇన్ఫో ప్రకారం ఈ భారీ చిత్రానికి కూడా త్రివిక్రమ్ లాస్ట్ రెండు చిత్రాలని పని చేసిన థమన్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవడం కన్ఫర్మ్ అని తెలుస్తుంది. అయితే గత కొన్నాళ్ల నుంచి ఈ టాక్ ఉంది మరి దీనిపై అధికారిక క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :