మహేష్ నెక్స్ట్ కు దాదాపు అతనే.?

Published on Apr 7, 2021 10:00 am IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇప్పుడు పరశురామ్ పెట్ల దర్శకత్వంలో “సర్కారు వారి పాట” అనే మాస్ ఫ్లిక్ లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఈ చిత్రం అనంతరం కూడా మహేష్ కు మంచి లైనప్ ఉంది. అయితే అందులో సర్కారు వారి పాట అనంతరం చెయ్యబోయే ప్రాజెక్ట్ ఏంటి అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు.

ఇప్పటికే పలువురు స్టార్ దర్శకులు లైన్ లో ఉన్నా రాజమౌళితో సినిమా స్టార్ట్ చెయ్యడానికి ముందు చెయ్యాల్సిన ఆ ప్రాజెక్ట్ పై మంచి ఆసక్తి నెలకొంది. అయితే మరి లేటెస్ట్ గాసిప్స్ ప్రకారం మహేష్ 28వ సినిమాను డైరెక్ట్ చేయబోయేది దాదాపు మాటల మంత్రుకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నే అని తెలుస్తుంది. వీరి కాంబోలో వచ్చింది రెండు సినిమాలే పైగా ఒకటి అప్పట్లో పెద్దగా ఆడక పోయినా ఇప్పటికి పెద్ద కల్ట్ క్లాసిక్ అయ్యిపోయింది. దీనితో ఈ కాంబోపై ఎనలేని అంచనాలు ఉన్నాయి. మరి ఈ కాంబో ఎప్పుడు పట్టాలెక్కుతుందో కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :