కుర్ర హీరోల మధ్య అండర్ స్టాండింగ్ బాగుంది

Published on Aug 30, 2019 9:18 am IST

టాలీవుడ్ హీరోల మధ్య ఆరోగ్యకరమైన వాతావణం నెలకొనివుంది. ముఖ్యంగా కుర్ర హీరోలు ఒకరికొకరు చాలా సన్నిహితంగా మెలగడంతో పాటు, మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు. అలాగే సినిమాల ప్రమోషన్స్ విషయంలో కూడా ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటున్నారు. సినిమాల విడుదల తేదీల విషయంలో కూడా వీరి మధ్య అవగాహన బాగుంది.

సాహో చిత్ర విడుదల కారణంగా హీరో నాని తన గ్యాంగ్ లీడర్ మూవీ విడుదల ఆగస్టు 30 నుండి, సెప్టెంబర్ 13కి మార్చుకున్నారు. దీనికి ఆయన నొచ్చుకొనకపోగా, సాహో చిత్రానికి బెస్ట్ విషెష్ చెప్పారు. అలాగే వరుణ్ తేజ్ , హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన వాల్మీకి చిత్ర విడుదల తేదీ సెప్టెంబర్ 13అని ముందుగా ప్రకటించినా, ఇప్పుడు దానిని 20కి మార్చడం జరిగింది.

ఇలాంటి ఏకాభిప్రాయం వలన వారివారి చిత్రాలకు ప్రయోజనమే కానీ, నష్టం ఏమి ఉండదు. అలా కాకుండా మూర్ఖంగా పోటీపడి విడుదల చేయడం వలన రెండు చిత్రాలు మంచి ఓపెనింగ్స్ కోల్పోవడం జరుగుతుంది. కుర్ర హీరోల మధ్య కొనసాగుతున్న ఇలాంటి రిలేషన్స్ మెచ్చుకోదగ్గవే.

సంబంధిత సమాచారం :