‘హెబ్బా పటేల్’ మళ్ళీ గెస్ట్ గానే.. ?

‘హెబ్బా పటేల్’ మళ్ళీ గెస్ట్ గానే.. ?

Published on Apr 23, 2020 2:00 AM IST

ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ హీరోగా చేస్తున్న ‘రెడ్’ సినిమాలో హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ ఐటమ్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. సెకెండ్ హాఫ్ లో వచ్చే ఒక స్పెషల్ సాంగ్ లో హెబ్బా కనిపించనుంది. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం హెబ్బా ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ తో పాటు గెస్ట్ రోల్ లో కూడా నటిస్తోందట. కేవలం రెండు సీన్స్ లో మాత్రమే హబ్బా పాత్ర ఉన్నప్పటికీ అవి చాల కీలమైన సీన్స్ అని తెలుస్తోంది. భీష్మ సినిమాలో కూడా హెబ్బా గెస్ట్ రోల్ చేసింది. మళ్ళీ రెడ్ సినిమాలో కూడా గెస్ట్ రోల్ లో నటిస్తోంది.

మొత్తానికి హీరోయిన్ క్యారెక్టర్స్ కే ఫిక్స్ కాకుండా సైడ్ క్యారెక్టర్స్ అండ్ స్పెషల్ సాంగ్స్ తో హెబ్బా మెరుస్తోంది. తిరుమల కిషోర్‌ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా దెబ్బకు సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ ఫోన్ అయింది. కాగా ఈ సినిమాలో రామ్ సరసన నివేదా పేతురాజ్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా సమీర్‌ రెడ్డి ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు