మహేష్ సినిమా ప్రమోషన్స్ కోసం అన్ని కోట్లా?

15th, April 2018 - 02:53:47 PM

ప్రస్తుత రోజుల్లో ఏ సినిమాకైనా ప్రమోషన్స్ చాలా అవసరం. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఈ రోజుల్లో ప్రమోషన్స్ చేయడానికి స్పెషల్ గా ప్లాన్స్ వేసుకుంటున్నారు. అయితే ఎప్పటిలానే మహేష్ నటించిన సినిమా ప్రమోషన్స్ కు భారీగా ఖర్చు పెడుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భరత్ అనే నేను సినిమాపై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు పెరిగాయి. అయినా కూడా నిర్మాత సినిమా ప్రమోషన్స్ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు.

ప్రచారాల కోసం దాదాపు 3 కోట్లవరకు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. కేవలం హైద్రాబాద్ సిటీలోనే 300 కు పైగా హోర్డింగ్స్ సెట్ చేశారు. అలాగే డిజిటల్ సైడ్ కూడా ప్రమోషన్స్ డోస్ పెంచేశారు. ప్రస్తుతం ఎక్కువగా మాట్లాడుకుంటున్న చిత్రంగా భరత్ అనే నేను నిలుస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ద్వారానే సినిమాకు క్రేజ్ చాలా పెరిగిపోయింది. ఇక ప్రస్తుతం చేస్తోన్న ప్రమోషన్స్ కూడా సినిమాకు బూస్ట్ ఇస్తున్నాయి. ఈ నెల 20న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.