హలో గురు.. 5రోజుల కలక్షన్స్ !

Published on Oct 24, 2018 8:25 am IST


ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన కామెడీ డ్రామా హలో గురు ప్రేమ కోసమే అక్టోబర్ 18న విడుదలై రామ్ కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ను సాధించిన చిత్రంగా నిలిచింది. ఇక మొదటి నాలుగు రోజులు మంచి కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం సోమవారం కొంచెం నెమ్మదించి రూ.1.30 కోట్ల షేర్ ను రాబట్టింది.

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈచిత్రం 5రోజులకుగాను రూ.14.70కోట్ల షేర్ వసూళ్లను సాదించి నైజాం తో పాటు సీడెడ్ తదితర ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను చేరుకుంది. అయితే ఓవర్సీస్ లో మాత్రం ఈచిత్రానికి ఆదరణ కరువయ్యింది. ఇప్పటివరకు అక్కడ ఈ చిత్రం హాఫ్ మిలియన్ మార్క్ ను కూడా చేరుకోలేకపోయింది. త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన ఈచిత్రంలో అనుపమా కథానాయికగా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు.

సంబంధిత సమాచారం :