కాకినాడలో ‘హలో గురు ప్రేమ కోసమే’ !
Published on Jun 25, 2018 4:01 pm IST

ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా దర్శకుడు నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. ప్రస్తుతం ఈ చిత్రం కాకినాడ పట్టణంలో చిత్రీకరిస్తున్నారు. తాజా షెడ్యూల్ లో పోసాని కృష్ణమురళి కూడా పాల్గొంటారు. కాగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్లో కల్లా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం శరవేగంగా చిత్రీకరణ జరుపుతోంది. ఈ చిత్రం పూర్తిగా ఎంటర్టైన్మెంట్ తో కూడుకుని ఉంటుందని సమాచారం. ‘సినిమా చూపిస్తా మావ, నేను లోకల్’ లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలకు పని చేసిన టీమే ఈ చిత్రానికి కూడా కలిసి పని చేస్తోంది.

ఈ చిత్రంలో రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ప్రణీత సుభాష్ మరో హీరోయిన్ గా కనిపించనుంది. ప్రకాష్ రాజ్ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.

  • 9
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook