‘ఉన్నదిఒకటే జిందగీ’ తరువాత ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తున్న చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. ప్రస్తుతం ఈసినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ‘నేను లోకల్’ ఫేమ్ త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో రామ్ కు జోడిగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది.
ఇక ఈచిత్రం యొక్క టీజర్ ను ఈరోజు విడుదలచేశారు. 39సెకండ్ల నిడివి గల ఈ టీజర్లో రామ్ ,అనుపమ ల కెమిస్ట్రీ హైలైట్ గా నిలిచింది. టీజర్ చేస్తుంటే సినిమా అంత రొమాంటిక్ మోడ్ లో సాగనుందని తెలుస్తుంది. మరి స్క్రీన్ మీద రామ్- అనుపమ ల కెమిస్ట్రీ వర్క్ అవుట్ అయితే సినిమా హిట్ అవ్వడం ఖాయం.
దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈచిత్రంలో ప్రణీత ముఖ్య పాత్రలో నటిస్తుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈచిత్రం దసరా కానుకగా అక్టోబర్18న విడుదల కానుంది. ఇక ఈచిత్రం విజయం సాధించడం రామ్ ,అనుపమలతో పాటు దిల్ రాజుకు కూడా చాలా అవసరం.
టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి


