‘మా” అధ్యక్షుడు నరేశ్‌పై హేమ ఫైర్..!

Published on Aug 7, 2021 10:23 pm IST

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికలు గత కొద్ది రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమలో దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ప్రకాశ్ రాజ్, జీవిత, మంచు విష్ణు, హేమ ఈ సారి మా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఎన్నికలను మరింత హీట్ పుట్టిస్తున్నారు. అయితే తాజాగా మా ఎన్నికలపై, అధ్యక్షుడు నరేశ్‌పై సినీ నటీ హేమ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

మా అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడాలని కొందరు చూస్తున్నారని, ఎన్నికలు లేకుండా నరేశ్‌నే అధ్యక్షుడిగా కొనసాగించేందుకు వారు ప్రయత్నిస్తున్నారని ఆమె అన్నారు. మా అధ్యక్ష ప‌ద‌వి నుంచి దిగిపోకుండా ఉండేందుకు నరేశ్‌ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించింది. ఇదే కాకుండా మా నిధులపై కూడా మాట్లాడిన హేమ ‘మా’ కోసం నరేశ్ ఒక్క రూపాయి కూడా సంపాదించలేదని, గతంలో ఉన్నవారు ఫండింగ్ చేసిన డబ్బులనే నరేశ్ ఖర్చు చేశారని అన్నారు. రూ.5 కోట్ల నిధుల్లో ఇప్పటివరకు రూ.3 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మిగతా డ‌బ్బంతా ఏమయ్యిందో నరేశ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

సంబంధిత సమాచారం :