ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అన్నీ ఆ రెండు చిత్రాలకే..!

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అన్నీ ఆ రెండు చిత్రాలకే..!

Published on Dec 22, 2019 9:41 AM IST

rangasthalam mahanati

చెన్నై వేదికగా గత రాత్రి సౌత్ ఫిలిం ఫేర్ అవార్డ్స్ 2019 వేడుక ఘనంగా జరిగింది. సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలకు చెందిన పలువురు వివిధ విభాగాలలో అవార్డులు గెలుచుకున్నారు. తెలుగు పరిశ్రమ నుండి రంగస్థలం మరియు మహానటి ఎక్కువ విభాగాలలో పోటీ పడ్డాయి. అలాగే ఈ రెండు చిత్రాలు అధిక విభాగాలలో అవార్డ్స్ గెలుచుకున్నాయి. రంగస్థలం మూవీ అత్యధికంగా ఐదు విభాగాలలో అవార్డ్స్ అందుకోగా, నాలుగు అవార్డ్స్ గెలుచుకొని మహానటి ఆ తరువాత స్థానంలో నిలిచింది.

ఉత్తమ నటుడు గా రామ్ చరణ్ రంగస్థలం చిత్రంలో నటనకు అందుకున్నారు. కీర్తి సురేష్ మహానటి చిత్రానికి ఉత్తమ నటి అవార్డ్స్ దక్కించుకుంది. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా దర్శకుడు పరుశురాం తెరకెక్కించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ గీత గోవిందం రెండు విభాగాలలో అవార్డ్స్ అందుకొంది. అన్ని వర్గాల ప్రేక్షకుల మనసులు హత్తుకున్న చిన్న చిత్రం కేరాఫ్ కంచరపాలెం కు మళ్ళీ నిరాశే ఎదురైంది.

టాలీవుడ్ నుండి వివిధ విభాగాలలో సౌత్ ఫిలిం ఫేర్ అవార్డ్స్ 2019 విన్నర్స్ లిస్ట్:

ఉత్తమ చిత్రం: మహానటి
ఉత్తమ దర్శకుడు: నాగ్ అశ్విన్ (మహానటి)
ఉత్తమ నటుడు: రామ్ చరణ్(రంగస్థలం)
ఉత్తమ నటి: కీర్తి సురేష్(మహానటి)
ఉత్తమ నటుడు(క్రిటిక్స్ ఛాయిస్): దుల్కర్ సల్మాన్(మహానటి)
ఉత్తమ నటి (క్రిటిక్స్ ఛాయిస్): రష్మిక మందాన(గీత గోవిందం)
ఉత్తమ సహాయ నటుడు: జగపతి బాబు( అరవింద సమేత)
ఉత్తమ సహాయ నటి: అనసూయ భరద్వాజ్(రంగస్థలం)
ఉత్తమ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్(రంగస్థలం)
ఉత్తమ గీత రచయిత: చంద్ర బోస్(రంగస్థలం)
ఉత్తమ గాయకుడు: సిద్ధ్ శ్రీరామ్(గీత గోవిందం)
ఉత్తమ గాయని: శ్రేయా ఘోషల్ (భాగమతి)

సంబంధిత సమాచారం

తాజా వార్తలు