మోషన్ పోస్టర్ తో దుమ్మురేపిన మహేష్..!

Published on Aug 9, 2020 9:24 am IST

సూపర్ స్టార్ మహేష్ నేడు తన 45వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకను వరల్డ్ వైడ్ మహేష్ ఫ్యాన్స్ ఘనంగా జరుపుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా వారు భారీ హంగామా చేస్తున్నారు. కాగా ఫ్యాన్స్ కోసం మహేష్ నేడు ఆయన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట మోషన్ పోస్టర్ తో వచ్చేశారు. రూపాయి కాయిన్ ని గాలిలోకి ఎగరేస్తున్న మహేష్ సినిమా పై ఆసక్తి పెంచేస్తున్నారు. ఈ మూవీ నేపథ్యం అంతా మనీ చుట్టే తిరుగుతుందని నేటి మోషన్ పోస్టర్ కానీ, టైటిల్ డిజైన్ కానీ తెలియజేస్తున్నాయి.

మొత్తంగా దర్శకుడు పరుశురామ్ మహేష్ ని సరికొత్తగా ప్రెజెంట్ చేస్తారు అనిపిస్తుంది. సాధారణ పరిస్థితులు ఏర్పడిన వెంటనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. వచ్చే ఏడాది విడుదల కానున్న సర్కారు వారి పాట మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ మరియు 14ప్లస్ రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్నాయి.

మోషన్ పోస్టర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More