రజినీ “అన్నాత్తే” షూట్ ఎప్పుడో క్లారిటీ వచ్చింది.!

Published on Dec 12, 2020 9:40 pm IST

ఈరోజు కోలీవుడ్ సూపర్ స్టార్ తలైవర్ రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా మొత్తం దేశ వ్యాప్తంగా అభిమానులు సినీ ప్రముఖులు అలాగే రాజకీయ నాయకులు దేశ ప్రధాని సైతం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఇప్పుడు రజిని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శివతో “అన్నాత్తే” అనే భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా మూలాన లాంగ్ బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. అలాగే రజిని కూడా పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడంతో మరోపక్క మరింత బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు రజిని పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు శివ తలైవర్ అభిమానులకు తమ అన్నాత్తే టీం నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఇక ఈ సందర్భంగా వచ్చే డిసెంబర్ 15 నుంచే ఈ చిత్రం షూట్ స్టార్ట్ కానుంది అని క్లారిటీ కూడా వచ్చేసింది. దీనితో ఈ ఇక్కడ నుంచి ఈ సినిమా శరవేగంగా పూర్తి కానుంది. అలాగే వచ్చే కొత్త ఏడాది ఆరంభంలోనే తన కొత్త పార్టీను ప్రకటించనున్న సంగతి తెలిసిందే. మొత్తానికి మాత్రం ఈ వార్తలతో రజిని అభిమానులు ఎగ్జైటెడ్ గా ఉన్నారు.

సంబంధిత సమాచారం :