కొండారెడ్డి బురుజు ముందు గొడ్డలి పట్టిన మహేష్ బాబు !

Published on Oct 7, 2019 5:34 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు’ – అనిల్ రావిపూడి – కాంబినేషన్ లో వస్తోన్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. కాగా తాజాగా ఈ సినిమా నుండి చిత్రబృందం దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టర్ ను విడుదల చేసింది. కాగా కొండారెడ్డి బురుజు ముందు గొడ్డలి పట్టి ఆవేశంగా స్టైలిష్ లుక్ లో కనిపిస్తోన్నాడు మహేష్ బాబు. పోస్టర్ మహేష్ అభిమానులతో పాటు నెటిజన్లను కూడా బాగా ఆకట్టుకుంటుంది.

ఇక మహేష్ బాబు ఎప్పుడు సెలవులు వచ్చినా తన కుటుంబంతో విదేశాలకు వెళ్తారు. దుబాయ్ మహేష్ బాబుకు ఇష్టమైన హాలిడే స్పాట్. సమయం దొరికినప్పుడల్లా మహేష్ తరచూ అక్కడకి వెళ్తుంటారు. కాగా ప్రస్తుతం మహేష్ తన భార్య మరియు పిల్లలతో కలిసి దుబాయ్ పర్యటనకు వెళ్ళారు. మహేష్ తిరిగి వచ్చాక, ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్‌ ను తిరిగి ప్రారంభిస్తాడట.

కాగా ఈ సినిమాలో మహేశ్ సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. మహేష్ అజయ్ కృష్ణ అనే ఆర్మీ మేజర్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు తో కలిసి అనిల్ సుంకర నిర్మించనున్నారు. సంక్రాంతి స్పెషల్ గా రానున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :

More