మన దగ్గర థలా అజిత్ షెడ్యూల్ ఇదే.!

Published on Oct 24, 2020 10:00 am IST

కోలీవుడ్ స్టార్ హీరో థలా అజిత్ కుమార్ హీరోగా అక్కడి టాలెంటెడ్ అండ్ యంగ్ డైరెక్టర్ వినోత్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “వలిమై”. వరుస విజయాల తర్వాత అజిత్ చేపట్టిన ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఎప్పుడో షూట్ ను మొదలు పెట్టుకున్న ఈ చిత్రం లాక్ డౌన్ మూలాన బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది.

అయితే ఈ చిత్రం తాలూకా కీలక షెడ్యూల్ మన దగ్గర హైదరాబాద్ లో ప్లాన్ చేసారని తెలిసిందే. అయితే ఇపుడు ఈ షెడ్యూల్ పై మరింత సమాచారం వినిపిస్తుంది. ఈ షెడ్యూల్ హైదరాబాద్ లో రేపటి నుంచే మొదలు కానుందట. అజిత్ కూడా రేపటి నుంచే షూటింగ్ లో పాల్గొననుండగా కొన్ని వారాల పాటు ఈ షూట్ కొనసాగనుంది. అలాగే అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ షూట్ ను ప్లాన్ చేసారట. ఈ చిత్రానికి సంగీత సంచలనం యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More