అలవైకుంఠపురంలో టీజర్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్

Published on Dec 9, 2019 10:16 am IST

అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న అలవైకుంఠపురంలో టీజర్ డేట్ వచ్చేసింది. ఈనెల 11 బుధవారం టీజర్ విడుదల చేయనున్నారు. ఈమేరకు చిత్ర యూనిట్ అధికారికంగా ఓ పోస్టర్ విడుదల చేయడం ద్వారా ప్రకటించేశారు . అలాగే నేడు ఈ టీజర్ ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో విడుదల చేయడం ద్వారా ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వనున్నారు. నేటి సాయంత్రం 4:05 నిమిషాలకు అలవైకుంఠపురంలో టీజర్ ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో విడుదల కానుంది. ఈ అప్డేట్ నిన్నే రావాల్సివుండగా మెగా ఫ్యామిలీ చిరకాల మిత్రుడు మరియు అభిమాని అయిన నూర్ మొహమ్మద్ మరణం చెందడంతో నేటికీ వాయిదా వేశారు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ బన్నీ కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం అలవైకుంఠపురంలో పై భారీ అంచనాలున్నాయి. పూజా హెగ్డే బన్నీతో రెండవ సారి జతకడుతుండగా ఓ కీలక పాత్రకోసం సీనియర్ హీరోయిన్ టబు ని తీసుకున్నారు. నివేదా పేతురాజ్, సుశాంత్ ఇతర కీలకపాత్రలలో నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి. థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More