నితిన్ పెళ్లిపై లేటెస్ట్ అప్డేట్.

Published on Jul 1, 2020 12:12 pm IST

కరోనా సంగతి ఎలా ఉన్నా…టాలీవుడ్ లో పెళ్లి సందడి నడుస్తుంది. ఇప్పటికే యంగ్ హీరో నిఖిల్ తన ప్రేయసి డాక్టర్ పల్లవి పెళ్లి చేసుకున్నారు. ఇక రానా దగ్గుబాటి తన లవర్ మిహికా బజాజ్ మెడలో ఆగస్టు 8న మూడుముళ్లు వేయనున్నారు. కాగా యంగ్ హీరో నితిన్ పెళ్లి కి కూడా ముహూర్తం కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి. నితిన్ కూడా చాలా రోజుల క్రితమే…తను ప్రేమించిన షాలినితో నిశ్ఛితార్థం చేసుకున్నాడు. ఇక ఏప్రిల్ లో వీరిద్దరి పెళ్లి జరగాల్సి ఉండగా…కరోనా లాక్ డౌన్ వలన వాయిదా వేసుకున్నారు.

దుబాయ్ లో భారీగా ఓ డెస్టినేషన్ మ్యారేజ్ ప్లాన్ చేసిన నితిన్ ఆశలపై కరోనా నీళ్లు చల్లింది. కాగా కరోనా ప్రభావం ఇప్పట్లో తగ్గే సూచనలు లేవు. రోజులు గడిచే కొద్ది కరోనా వైరస్ ప్రభావం మరింతగా పెరుగుతుంది. దీనితో ఇంకా ఎదురు చూడడం అనవసరం అనుకున్న కుటుంబ సభ్యులు ఈ నెలలోనే నితిన్ షాలిని పెళ్లికి ముహూర్తం పెట్టారట. ఈనెల చివర్లో… వీరిద్దరి వివాహం జరగనుందని వినికిడి. కాబట్టి రానా కంటే ముందే నితిన్ బ్యాచ్ లర్ లైఫ్ కి బై బై చెప్పనున్నాడు.

సంబంధిత సమాచారం :

More