2020 ఆస్కార్ విజేతలు వీరే..!

2020 ఆస్కార్ విజేతలు వీరే..!

Published on Feb 10, 2020 11:51 AM IST

ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ సినిమా అవార్డ్స్ వేడుక అమెరికా లోని లాస్ ఏంజెల్స్ నందు గల డాల్బీ థియేటర్ లో జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుండి అనేక భాషలలో తెరకెక్కిన ఉత్తమ చిత్రాలు ఈ అవార్డ్స్ నందు పోటీ పడ్డాయి. ఐతే దక్షిణ కొరియాకు చెందిన కొరియన్ మూవీ పారసైట్ ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్, ఒరిజినల్ స్క్రీన్ ప్లే కేటగిరీలలో నాలుగు అవార్డ్స్ సొంతం చేసుకొని అందరినీ ఆశ్చర్య పరించింది. ఈ చిత్రంతో ఆస్కార్డ్ అవార్డు అందుకున్న బోన్గ్ జోన్ హో పారసైట్ చిత్రాన్ని కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. ఇక జోకర్ చిత్రంలో అద్భుత నటన కనబరిచిన జాక్వీన్ ఫీనిక్స్ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. జోకర్ మూవీ బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో కూడా అవార్డు అందుకుంది. జ్యూడీ చిత్రానికి గాను జీనీ జెల్ వెగ్గర్ ఉత్తమ నటి అవార్డ్ గెలుపొందారు.

ఇక ఈ ఏడాది ఆస్కార్స్ లో 1917 మూవీ మూడు అవార్డ్స్ తో సత్తా చాటింది. విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ, సౌండ్ మిక్సింగ్ విభాగాలలో ఈ చిత్రం అవార్డ్స్ సొంతం చేసుకుంది. వన్స్ అపాన్ ఏ టైం ఇన్ హాలీవుడ్ చిత్రంలో నటనకు బ్రాడ్ పిట్ ఉత్తమ సహాయ నటుడు అవార్డు అందుకోగా మ్యారేజ్ స్టోరీ చిత్రంలో నటనకు లారా డెర్న్ ఉత్తమ సహాయనటిగా అవార్డ్ గొలుపొందారు.ఇక ఈ ఏడాది ప్రేక్షకుల మనసు దోచుకున్న ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ బెస్ట్ సౌండ్ ఎడిటింగ్, ఫిల్మ్ ఎడిటింగ్ విభాగాలలో రెండు అవార్డ్స్ సొంతం చేసుకుంది.

విభాగాల వారీగా 2020 ఆస్కార్ విజేతలు వీరే..

బెస్ట్ యాక్టర్ : జాక్విన్ ఫీనిక్స్(జోకర్)

బెస్ట్ యాక్ట్రెస్ : జీనీ జెల్ వెగ్గర్(జ్యూడి)

బెస్ట్ మూవీ : పారసైట్

బెస్ట్ డైరెక్టర్ : బోన్గ్ జోన్ హో(పారసైట్)

బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ : బ్రాడ్ పిట్- వన్స్ అపాన్ ఏ టైం ఇన్ హాలీవుడ్

బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ : లారా డెర్న్-మ్యారేజ్ స్టోరీ

బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: పారసైట్

బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: జోజో రాబిట్

బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్: పారసైట్(సౌత్ కొరియా)

బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్:  టాయ్ స్టోరీ 4

బెస్ట్ సౌండ్ ఎడిటింగ్: ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ

బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్: 1917

బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్: ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ

బెస్ట్ యానిమేటెడ్ షార్ట్: హెయిర్ లవ్

బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ : ది నైబర్స్ విండో

బెస్ట్ డాక్యూమెంటరీ షార్ట్: లెర్నింగ్ టు స్కేట్ బోర్డు ఇన్ ఏ వార్ జోన్(ఇఫ్ యు ఆర్ ఏ గర్ల్)

బెస్ట్ ఒరిజినల్ స్కోర్: జోకర్

బెస్ట్ ఒరిజినల్ సాంగ్: లవ్ మీ అగైన్(రాకెట్ మాన్)

బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: వన్స్ అపాన్ ఏ టైం ఇన్ హాలీవుడ్

బెస్ట్ సినిమాటోగ్రఫీ: 1917

బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్: లిటిల్ విమెన్

బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ డిజైన్: బాంబ్ షెల్

బెస్ట్ డాక్యూమెంటరీ ఫీచర్: అమెరికన్ ఫ్యాక్టరీ

బెస్ట్ సౌండ్ మిక్సింగ్: 1917

సంబంధిత సమాచారం

తాజా వార్తలు