అలవైకుంఠపురంలో టీజర్: బన్నీ ఇప్పుడే క్యారెక్టర్ ఎక్కాడట..!

Published on Dec 11, 2019 4:19 pm IST

త్రివిక్రమ్-బన్నీ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ అలవైకుంఠపురంలో. ఈ చిత్రంపై ఉన్న అంచనాల రీత్యా ప్రతి అప్డేట్ పై అభిమానులలో విపరీతమైన ఆసక్తి నిలకొని ఉంది. ఇక నేడు ఈ మూవీ నుండి టీజర్ వస్తుందని చిత్ర యూనిట్ ప్రకటించడంతో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా కొద్దిసేపటి క్రితం అందరూ ఎదురుచూస్తున్న అలవైకుంఠపురంలో టీజర్ విడుదలైంది.అంచనాలకు తగ్గట్టుగా త్రివిక్రమ్ మార్కు మేకింగ్ తో టీజర్ సాగింది.

వైకుంఠపురం అనే ఇంటికి బన్నీకి ఉన్న సంబంధం ఏమిటనేది అలవైకుంఠపురంలో అసలు ట్విస్ట్ లాగుంది. బ్యూటిఫుల్ పూజా లేడీ బాస్ గా కనిపిస్తుండగా బన్నీ ఆ ఆఫీస్ ఎంప్లాయ్ లా కనిపిస్తున్నారు. ఇక సచిన్ ఖేడేకర్ మరియు సముద్ర ఖనిలు విలన్స్ అయ్యే అవకాశం కలదు.టబు, జయరామ్ రిచ్ కపుల్ లా కనిపిస్తుండగా సుశాంత్, రాహుల్ రామకృష్ణ , నవదీప్ ఆఫీస్ ఎంప్లాయ్ పాత్రలు చేస్తున్నారు. ఫన్ లేకున్నా సీరియస్ అండ్ ఎక్సయిటింగ్ గా టీజర్ ఉంది.

హరికి అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. టబు కీలక రోల్ చేస్తుండగా హీరో సుశాంత్, నివేదా పేతురాజ్ ఇతర ప్రాధాన్యం ఉన్న పాత్రలలో నటిస్తున్నారు. 2020 జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల అవుతుంది.

టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :