ఇక్కడ “కేజీయఫ్ 2” నే హైయెస్ట్ అట.!

ఇక్కడ “కేజీయఫ్ 2” నే హైయెస్ట్ అట.!

Published on Jul 2, 2021 11:00 AM IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ అండ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2”. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం థియేట్రికల్ గానే భారీ స్థాయి బిజినెస్ జరుపుకుందని తెలిసిందే. ఇక అలాగే నిన్ననే ఈ చిత్రం తాలూకా ఆడియో హక్కులు కూడా భారీ ఫిగర్ కి అమ్ముడు పోయినట్టు కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఈ చిత్రంకి ఒక్క ఆడియో రైట్స్ నే 7.2 కోట్లకి అమ్ముడుపోయాయని తెలిసింది.

మరి ఇది టోటల్ మన సౌత్ ఇండియన్ సినిమాలోనే ప్రస్తుతానికి హైయెస్ట్ అట. మరి దీనికి ముందు కోలీవుడ్ చిత్రం “మాస్టర్” నాలుగున్నర కోట్లు అలాగే మూడో స్థానంలో ఈ కేజీయఫ్ చాప్టర్ 1 నే ఉంది. ఇలా మొత్తానికి టాప్ 3లో రెండు కేజీయఫ్ సినిమాలే ఉన్నాయి. మరి ఇంకా ముందు రోజుల్లో మరిన్ని బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిలో ఏదైనా ఈ రికార్డును బ్రేక్ చేస్తుందేమో చూడాలి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు