తండ్రైన మరో టాలీవుడ్ హీరో..!

తండ్రైన మరో టాలీవుడ్ హీరో..!

Published on Dec 17, 2015 2:00 PM IST

aadi
ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు బ్యాచులర్ లైఫ్ కు ఫుల్ స్టాప్ పెట్టి పెళ్లి పీటలు ఎక్కుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా యువ హీరోలు టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న కొత్తలోనే పెళ్లి చేసుకుని ముందుకు సాగుతున్నారు. ఈ కోవలోనే టాలీవుడ్ డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడు, యువ హీరో ఆది వివాహం తను ప్రేమించిన అరుణతో గతేడాది డిసెంబర్ 13న అంగరంగ వైభవంగా జరిగింది.

హీరో ఆది ఇప్పుడు భర్త నుంచి తండ్రిగా ప్రమోట్ అయ్యాడు. తాజాగా ఈ యువ హీరో దంపతులకు పాప జన్మించింది. ఈ విషయాన్ని ఆది తన అధికారిక ఫేస్ బుక్ ఖాతా ద్వారా తెలియజేశాడు. ఈ సందర్భంగా తమకు మీ అందరి దీవెనలు కావాలంటూ పేర్కొన్నాడు. పలువురు పాపను ఆశీర్వదిస్తూ ఆదికి శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా, ఆది ప్రస్తుతం ‘గరం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.

తాజా వార్తలు