ఇంటర్వ్యూ : హీరో అభిలాష్‌ – నాకు అంద‌రు హీరోలు ఇన్స్‌పిరేష‌నే.
Published on Sep 2, 2018 11:24 pm IST

 

స్టోన్ మీడియా ఫిల్మ్ బ్యాన‌ర్‌లో నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ స‌మ‌ర్పించు చిత్రం ప్రేమ‌కు రెయిన్ చెక్‌. ఈ చిత్రానికి ఆకెళ్ళ పేరి శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించి నిర్మిస్తున్నారు. ఈ నెల 7వ తేదీన ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా పాత్రికేయుల స‌మావేశంలో చిత్ర క‌థానాయ‌కుడు అభిలాష్‌ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం..

మీకు సినిమాల్లోకి రావాలని, అందునా హీరో కావాలని ఎందుకు అనిపించింది ? మీ గురించి కూడా చెప్పండి ?

నా పేరు అభిలాష్‌, నేటివ్ ప్లేస్ విజ‌య‌న‌గ‌రం ద‌గ్గ‌ర‌ సాలూర్‌. చ‌దువుకున్న‌ది యు.కెలో. నాకు యాక్ట‌ర్ అవ్వాల‌ని ఎప్ప‌టినుంచో ఉంది. కానీ ఎక్క‌డకి వెళ్ళాలి, ఎవ‌ర్నీ ఎప్రోచ్ కావాలో తెలియ‌దు. ఒక ఏజ్ వచ్చాక చ‌దువు పూర్త‌య్యాయిన వెంటనే యాక్టింగ్ నేర్చుకోవాల‌ని ఫిక్స్ అయ్యాను. అలా బ్యారిజాన్ అనే యాక్టింగ్ స్కూల్లో యాక్టింగ్ బాగా నేర్పిస్తార‌ని అక్కడ నేర్చుకున్నాను. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఆడిషన్స్ కి వచ్చి హీరోగా సెలెక్ట్ అయ్యాను.

‘ప్రేమ‌కు రెయిన్ చెక్‌’ అనే టైటిల్ ఏమిటి ?

మేము ఏదో.. డిఫ‌రెంట్‌గా ఉండాలి, కొత్త‌గా ఉండాల‌ని ఏమీ ఈ టైటిల్ పెట్ట‌లేదు. రెయిన్ చెక్ అంటే భ‌విష్య‌త్తులో తీర్చే ప్ర‌మాణం అని అర్ధం. సినిమాలోని ఓ కీలక పాత్రకు ఈ టైటిల్ లింక్ ఉంటుంది.

ఈ సినిమాలో మీ క్యారెక్ట‌ర్ గురించి చెప్పండి ?

ఈ చిత్రంలో నా క్యారెక్ట‌ర్ పేరు విక్కీ నేను చాలా సిన్సియ‌ర్ అన్న‌ట్లు. అంద‌రికి హీరోయిన్‌ రెయిన్ చెక్ ఇస్తే నేను ఈ అమ్మాయికి రెయిన్ చెక్ ఇస్తాను. నాకు జీవితంలో ఒక ఫిలోస‌ఫీ ఉంటుంది. నేను ఆఫీస్‌లో ఉండ‌గా ల‌వ్, రొమాన్స్ లాంటివి పెట్టుకోకూడ‌దు ఒక వేళ పెట్టుకుంటే దానివ‌ల్ల కెరీర్ డిస్ట్ర‌బ్ అవుతుంది అని నమ్మే క్యారెక్టర్ నాది.

మీ లైఫ్‌లో ఎవ‌రైనా రెయిన్‌చెక్ ఇచ్చారా..?

హ‌..హ‌..హ.. లేదండీ. నేను ఎవ‌రికీ ఇవ్వ‌లేదు. నాకు ఎవ్వ‌రూ ఇవ్వ‌నలేదు.

ఈ సినిమాలో మీ సరసన నటించిన హీరోయిన్స్ గురించి చెప్పండి ?

ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించారు. వాళ్ళు చాల బాగా నటించారు. నా పాత్రకు వాళ్ళ పాత్రలకు మధ్య సీన్స్ చాలా బాగా అలరిస్తాయి. సినిమా చూస్తే మీకే అర్ధ‌మ‌వుతుంది.

ఈ సినిమా డైరెక్ట‌ర్‌, ప్రొడ్యూస‌ర్ ఆకెళ్ళ పేరి శ్రీ‌నివాస్ ఒక్కరే. అయన గురించి చెప్పండి ?

మా డైరెక్ట‌రే ప్రొడ్యూస‌ర్‌ కావడం మా అదృష్టం. ఎన్నో జాగ్రత్తలు తీసుకోని ఆయన ఈ సినిమా తీశారు. ‘ప్రేమ‌కు రెయిన్ చెక్’ సినిమా మొత్తం అయ‌న విజ‌నే. ఆయ‌న ఎలాగైతే ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాల‌నుకున్నారో అలాగే తీశారు. నా క్యారెక్ట‌ర్ ఎడ్వెంచ‌ర్స్ స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ కాబ‌ట్టి దానికి సంబంధించి ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ కోసం ఆయ‌న డెహ్రాడూన్ తీసుకువెళ్ళారు . డెహ్రాడూన్‌లో రెండు వారాల షెడ్యూల్ అది మూడు, నాలుగు లొకేష‌న్స్‌లో తీశారు. కొత్త వాళ్ళతో సినిమా తియ్య‌డ‌మంటేనే గ్రేట్, అటువంటిది ఆయ‌న యూనిట్ లోని 60 మెంబ‌ర్స్‌ని డెహ్రాడూన్ తీసుకువెళ్ళి. షూటింగ్ చెయ్య‌డం అన్న‌ది చాలా గ్రేట్‌. ఆయ‌నే ఈ చిత్రానికి ప్రొడ్యూస‌ర్ కాక‌పోయుంటే ఆ పాట‌ను ఇక్క‌డ కెబిఆర్ పార్క్‌లో తీసేసేవారు.

ఈ సినిమాకి నార్త్ స్టార్ ప్రొడ‌క్ష‌న్ ప్రెసెంట్స్ ఇవ్వడంతో మీకు ఏమనిపించింది ?

శ‌ర‌త్‌ మ‌రారుగారు జెపిగారికి మొద‌టినుంచే ప‌రిచయం ఉంది. వాళ్ళిద్ద‌రూ క‌లిసి ప‌నిచేశారు. క‌థ విని మూవీ చూసిన త‌ర్వాత శ‌ర‌త్‌ మ‌రార్‌ గారికి బాగా న‌చ్చింది. ఆయ‌న ప్రెజంట్ చెయ్య‌డానికి ముందుకు వ‌చ్చారు. కొత్త‌వాళ్ళ‌తో వస్తున్న సినిమాకి, అంత పెద్ద ప్రొడ‌క్ష‌న్ హౌస్ సపోర్ట్ దొరకడం అంటే మా అంద‌రికీ చాలా సంతోషంగా ఉంది.

ఈ సినిమాలో నటించిన ఇతర నటీనటుల గురించి చెప్పండి ?

ఈ చిత్రంలో మూడు మొయిన్ క్యారెక్ట‌ర్స్ తో పాటు, మొత్తం ఎనిమిది ముఖ్యమైన క్యారెక్ట‌ర్లు కూడా ఉన్నాయి. హీరో సుమ‌న్‌గారు, ర‌ఘుగారు బిగ్‌బాస్ షోలో గిరీష్‌ గారు ఇలా వీళ్ళంద‌రూ ఈ సినిమాలో చేశారు.

తెలుగులో మీకు ఇష్ట‌మైన హీరోలు ఎవరు ?

అంద‌రూ ఇష్ట‌మే. రామ్‌చ‌ర‌ణ్, విజ‌య్‌దేవ‌ర‌కొండ‌, అంద‌రూ ఇష్టమే. కాకపోతే చిన్న‌ప్ప‌టినుండి మ‌హేష్‌బాబు సినిమాలు ఎక్కువ‌గా చూసివాడ్నే. ఒక విధంగా నాకు అంద‌రు హీరోలు ఇన్స్‌పిరేష‌నే.

మీ ఫ్యామిలీ గురించి చెప్పండి ?

అమ్మ హౌస్‌వైఫ్‌, నాన్న‌, అన్న‌య్య జాబ్ చేస్తారు. వాళ్ళంద‌రూ సాలూర్‌లోనే ఉంటారు.

మరి మీకు విజ‌య‌న‌గ‌రం స్లాంగ్ రావ‌డంలేదు ?

నేను 19 ఏళ్ళ‌కే యుకె వెళ్ళిపోయాను, మ‌ళ్ళీ ఈ మ‌ధ్య‌నే వ‌చ్చాను. చ‌దువు మొత్తం పూర్త‌య్యాకే నేను ముంబై వ‌చ్చి యాక్టింగ్ స్కూల్‌లో జాయిన అయ్యాను. సాలూరు అప్పుడ‌ప్పుడు వెళ‌తాను. అందుకే కొంచెం నాకు ఆ స్లాంగ్ బాగా రాదు.

మీరు తరువాత చేయబోయే సినిమాల మీద ప్లానింగ్ ఏదైనా ఉందా ?

ఇప్పటికి అలా ఏమీ లేదండి. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 7న విడుద‌ల‌వుతుంది. రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను.

భవిష్యత్తులో ఎలాంటి క్యారెక్ట‌ర్స్‌ చెయ్యాలనుకుంటున్నారు ?

నేను కొత్త‌వాడ్ని ఇప్పుడే నాకు ఆప్ష‌న్స్ ఏమీ ఉండ‌వు అండీ. వాళ్ళు న‌న్ను సెలెక్ట్ చేసుకుని ఎలాంటి క్యారెక్ట‌ర్‌లో న‌న్ను తీసుకుంటారో దానికి న్యాయం చెయ్య‌డం అంతే.

  • 13
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook