“ఎవరు” మూవీ రహస్య షూటింగ్ అందుకే-అడవి శేషు

Published on Jun 3, 2019 10:06 am IST

క్షణం, గూఢచారి వంటి విభిన్న చిత్రాలలో నటించి మంచి విజయాలు అందుకున్నారు హీరో అడవి శేషు. తన తదుపరి మూవీ వివరాలు నేడు ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు ఆయన. “ఎవరు” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ని ఈ మూవీకి పెట్టారు. వెంకట్ రాంజీ దర్శకత్వంలో సస్పెన్సు థ్రిల్లర్ గా ఈమూవీ తెరకెక్కుతుంది.

సినిమాపై ఆసక్తిని పెంచడానికి ఈ సినిమా షూటింగ్ రహస్యంగా మీడియా కి సమాచారం లేకుండా పూర్తి చేసారంట. అడవి శేషుకి సరసన హీరోయిన్ గా రెజీనా కాసాండ్రా చేస్తున్న ఈ మూవీలో నవీన్, మురళి శర్మ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అన్ని కారక్యమాలు పూర్తిచేసి ఆగస్టు 23న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్.

సంబంధిత సమాచారం :

More