నా పేరుకు ముందు “థల” తీసేయండి – అజిత్ కుమార్

Published on Dec 1, 2021 5:00 pm IST

తమిళ నాట సెన్సేషన్ హీరో అయిన అజిత్ కుమార్ తాజాగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా కు, పబ్లిక్ కి, తన నిజమైన అభిమానులకు ఒక విజ్ఞప్తి చేశారు. అజిత్, అజిత్ కుమార్ లేదా AK అని పిలవండి అని అన్నారు. అంతేకాక తన పేరు ముందు థల (thala) తీసేయండి అంటూ చెప్పుకొచ్చారు. మీ అందరి జీవితాలు అందంగా, సంతోషం గా, శాంతి తో, విజయవంతం గా ఉండాలి అంటూ కోరుకున్నారు అజిత్.

అజిత్ హీరోగా వలిమై చిత్రం రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, విడియోలు, పాటలు ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

సంబంధిత సమాచారం :