మేకప్ కోసం బన్నీ డెడికేషన్ మామూలుగా లేదట..!

Published on Aug 25, 2021 12:59 am IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ హీరోగా, రష్మికా మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ “పుష్ప”. పాన్‌ ఇండియన్ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుద‌ల చేయ‌నున్నారు. మొదటి భాగం “పుష్ప ది రైజ్” క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగనున్న ఈ సినిమాలో స్టైలిష్‌ స్టార్‌ మునుపెన్నడు చూడని విధంగా మాస్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. అయితే తన లుక్‌ కోసం బన్ని బాగానే కష్టపడుతున్నాడట.

రింగుల జుట్టు, గుబురు గడ్డంతో వీరమాస్‌ లుక్‌లో కనిపించేలా టాన్ టచ్ అప్‌లు చేయించుకోవడానికి 3 గంటల పైనే సమయం కేటాయిస్తున్నాడట. పుష్పరాజ్‌గా మేకప్ వేయించుకోవడానికి రెండు గంటలు, ఆ మేకప్‌ను తొలగించడానికి గంటకు పైగా సమయం పడుతుందట. అయితే మేకప్ కోసం బన్నీ డెడికేష‌న్‌ను చూసి చిత్ర బృందం అంతా ఫిదా అవుతున్నారట. మేకప్‌ విషయంలో బన్నీ ఓపికకు సెట్‌లో ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుందట.

సంబంధిత సమాచారం :