‘మళ్ళీ మళ్ళీ చూశా’ సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు – హీరో అనురాగ్ కొణిదెన.

‘మళ్ళీ మళ్ళీ చూశా’ సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు – హీరో అనురాగ్ కొణిదెన.

Published on Oct 20, 2019 2:00 PM IST

క్రిషి క్రియేషన్స్‌ పతాకంపై అనురాగ్‌ కొణిదెన హీరోగా పరిచయం చేస్తూ హేమంత్‌ కార్తీక్‌ దర్శకత్వంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. కోటేశ్వరరావు నిర్మించిన యూత్‌ ఫుల్‌ ఎంటర్టైనర్‌ ”మళ్ళీ మళ్ళీ చూశా’. శ్వేత అవస్తి, కైరవి తక్కర్‌ హీరోయిన్లు. ఈ చిత్రం అక్టోబర్‌ 18న తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజై అన్ని వర్గాల ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో .. దర్శకుడు హేమంత్ కార్తీక్ మాట్లాడుతూ – “చాలా సంవత్సరాలుగా అవకాశం కోసం ఎదురుచూస్తున్న టైంలో కోటేశ్వరరావు గారు ఏజ్ కాదు.. టాలెంట్ ఇంపార్టెంట్ అని నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చారు ముందుగా ఆయనకు ధన్యవాదాలు. అనురాగ్ నేను ఒక ఫ్యామిలీ మెంబర్స్ లా కలిసిపోయి ఈ సినిమా చేశాం. మా ఇద్దరి మధ్య అంత కో-ఆర్డినేషన్, కోఆపరేషన్ ఉంది కాబట్టే సినిమా ఇంత బాగా వచ్చింది. అలాగే మా డిఓపి కళ్యాణ్ అన్న టెక్నికల్ గా చాలా సపోర్ట్ చేశారు. శ్రావణ్ భరద్వాజ్ తన సంగీతం తో సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు, ఎలేంద్ర మహావీర్ ఒక పెద్ద సినిమాలా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. శ్వేతా అవస్థి తెలుగు రాక పోయినా చాలా బాగా అర్ధం చేసుకొని నటించింది” అన్నారు.

హీరో అనురాగ్ కొణిదెన మాట్లాడుతూ – “మేము ఇక్కడ ఇంత బాగా మాట్లాడుతున్నాం అంటే మైత్రి రవి గారు, అనిల్ సుంకర గారు చాలా సపోర్ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా వారిద్ద‌రికీ నా హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు. యంగ్ టీమ్ ఎదోఒకటి చేసి పెద్ద‌గా కొట్టాలని క‌సితో ఈ సినిమా చేశాం. మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే మీడియా ప్రతి చోట పాజిటివ్ రివ్యూస్ ఇచ్చి మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. ముఖ్యంగా యాక్షన్, పెర్ఫామెన్స్ కొత్త హీరోలా లేదు అని రాసి నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. కార్తీక్ సినిమాను చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఈ సినిమాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మా క్రిషి క్రియేషన్స్‌ తరపున థాంక్యూ” అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు